శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బొత్స సత్యనారాయణ కుమార్తెకు కీలక పదవి

2 గంటల క్రితం

Botsa Satyanarayana's daughter gets key post
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : వైసిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ప్రత్యక్ష, క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసిపి అధినేత జగన్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషను నియమిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. భీమిలి పరిధిలో క్షేత్రస్థాయి నాయకులను, విస్తృత కేడర్‌ను సమాయత్తం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కీలక బాధ్యతను ఆమెకు అప్పగించారు. గతంలో ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ పలు ఉచిత వైద్య, సామాజిక కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన అనూష, తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అధికారికంగా భీమిలి సమన్వయకర్తగా నియమితులయ్యారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్