అల్లూరి : భారీ వర్షాల కారణంగా ... అల్లూరి జిల్లాలో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. జి.కె.వీధి మండలం గంగవరం వద్ద ఉన్న తాత్కాలిక వంతెన వరద నీటి ఉధృతికి దెబ్బతిని కొట్టుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లోని సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024లో ఇదే ప్రాంతంలోని వంతెన కొట్టుకుపోవడంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేశారు. అయితే వర్షాలు, వరదల సమయంలో ఈ తాత్కాలిక వంతెన పదేపదే కొట్టుకుపోతుండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా మరోసారి వంతెన కొట్టుకుపోవడంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కొట్టుకుపోయిన వంతెన - 15 గ్రామాలకు ఆగిన రాకపోకలు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)