- ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలి.. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి
- కర్నూలు కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నిరసన
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివారం నిరసన తెలిపారు. సిపిఎం, సిపిఐ, ఎస్‌యుసిఐఐ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితర పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు టి.రాముడు, పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కెవి.నారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి నాగన్న, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అని, దాని నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అంజిబాబు, ఎండి.ఆనంద్‌బాబు, జిల్లా కమిటీ సభ్యులు, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎస్‌యుసిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)