ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయిలో మూడు పార్టీలు ఐక్యంగా ఉన్నట్లే క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ మేరకు కూటమి ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో మంచి నాయకత్వం రావాలని, స్థానిక సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారాలు లభించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, సి4 ద్వారా పేద కుటుంబాలకు అందిస్తున్న చేయూతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఓటూ ముఖ్యమేనని, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు అభ్యర్థించాలని సూచించారు. ఐక్యతే కూటమి బలమని, మూడు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ సాగించాలన్నారు.
Print Editionపంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)