ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మవరంలో బిజెపి, జనసేన మధ్య ఘర్షణ

1 గంట క్రితం

Clash between BJP and Jana Sena in Dharmavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- సత్యసాయి : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 1 వ వార్డులో బిజెపి, జనసేన మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ఓటర్లను ప్రభావితం చేసే విషయంలో బిజెపి, జనసేన స్థానిక శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మొదలైన మాటల యుద్ధం మరింత రాజుకొని తోపులాట, పరస్పర దాడులకు దారితీసింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. ఘర్షణ తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్