- తిరువనంతపురం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఛైర్మన్ కె జయకుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: శబరిమలలోని పంపా నదిలో పాత దుస్తులు విడిచిపెట్టే ఆచారాన్ని భక్తులు మానుకోవాలని తిరువనంతపురం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఛైర్మన్ కె జయకుమార్ కోరారు. ఈ సంప్రదాయానికి మతపరమైన ప్రాధాన్యత లేదని, నదీ పరిశుభ్రతను కాపాడేందుకు భక్తుల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు సోమవారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది యాత్రకు 'పరిశుభ్రమైన శబరిమల.. పవిత్రమైన శబరిమల` నినాదంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. మరుగుదొడ్లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని, నిర్వహణకు ప్రత్యేక సంస్థను నియమించామని పేర్కొన్నారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా శబరిమల ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల అవసరాలకు సరిపడా అరవణ ప్రసాదం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యాత్ర విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.








కామెంట్‌లు (0)