శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర మంత్రి జెపీ నడ్డాతో సిఎం చంద్రబాబు కీలక చర్చలు

3 గంటల క్రితం

CM Chandrababu holds key discussions with Union Minister JP Nadda.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం.. విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. సిఎంతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని), స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్