శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

34 మంది ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి సుభాష్

1 గంట క్రితం

Minister Subhash felicitated 34 teachers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : గురువులను గౌరవించిన సమాజo అభివృద్ధి చెందుతుందని, గురువులు బోధించిన జ్ఞానం, క్రమశిక్షణ, విలువలే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం టీచర్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ద్రాక్షారామ హై స్కూల్ విద్యార్థులు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థిని కోన అభిశ్రీ 593 మార్కులతో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం, 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు పొందడం, ఐదు మంది విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించడం పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమని ప్రశంసించారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాల తన నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల పట్టుదల ఉన్నాయని ,ప్రస్తుతం బాలికలు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, సమాజ అభివృద్ధికి మహిళా విద్య అత్యంత కీలకమని చెప్పారు. స్త్రీలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొంటూ విద్యార్థులు విద్యతో పాటు విలువలు, సంస్కారం, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. అరవవిసు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, టేకుమూడి సత్యనారాయణ, ముప్పనపల్లి గణేష్, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, ఆళ్ల బుజ్జి, బీజేపీ మండల అధ్యక్షులు అకేటి కృష్ణ, శివాజీ, కర్రా నాగేశ్వర్, ఇన్‌చార్జి హెచ్‌ఎం మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్