ప్రజాశక్తి,రామచంద్రపురం (కోనసీమ) : రామచంద్రపురంలోని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు 37 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్‌కు తరలివచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రజలు సమర్పించారు. అర్జీదారులతో మంత్రి సుభాష్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖల అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇస్తూ పరిష్కార మార్గాలనుఅన్వేషిస్తున్నా మని మంత్రి తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు.
మంత్రి ప్రజా దర్బార్ కు 37 అర్జీలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)