ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని శ్రీ సిద్ధార్థ పాఠశాలలో గురుపూజోత్సవం కార్యక్రమం పాఠశాల డైరెక్టర్ కె.ముల్లారావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య ఉపాధ్యాయునిగా జీవితాన్ని ఆరంభించి దేశానికి అత్యంత పదవులు అయినా రాష్ట్రపతి గా, ఉపరాష్ట్రపతిగా, సేవలందించి అందరి మన్ననలు పొందారని ఆయన అన్నారు. అత్యున్నత పదవులు పొందిన ఆ మహనీయుడు ఉపాధ్యాయ విధుల కంటే గొప్ప వృత్తి మరొకటి లేదనడం ఆయన ఔదార్యాన్ని చాటుతుందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎంతోమంది ఆదర్శ పౌరులను తయారు చేయగలరన్నారు. అలాగే ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయగలరని పేర్కొన్నారు. అందువల్లే ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ విష్ణు, జేసీనా జోసెఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సిద్ధార్థ స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)