శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసిని సమర్థించిన సిఎం చంద్రబాబు

2 గంటల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాజ్యాంగ సంస్థలను గౌరవించాలంటూ ట్వీట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై దేశవ్యాప్తంగా పెద్దయెత్తున విమర్శలొస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సమర్థించారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని, భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని శనివారం ఎక్స్‌‌లో ట్వీట్‌ ‌చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌, కమిషనర్లు ఎస్‌ఎస్‌ ‌సంధూ, వివేక్‌ ‌జోషి కలిసి ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని, దానికి సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారని పేర్కొన్నారు. 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు చెప్పినా ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలు పట్టించుకోలేదని తీవ్ర విమర్శలొస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు బాధాకరమని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపును, ఓటమిని సమానంగా, హుందాతనంతో స్వీకరించడం కూడా నాయకత్వ లక్షణమే అని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్