ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్‌బహుదుర్ శాస్ర్తీ జయంతులు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి నివాళలర్పించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేశారు. గాంధీజి ఆశయాలు నేటికీ మనకు మార్గదర్శకం అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజలను ఏకం చేసి నడిపించిన తీరు చిరస్మరణీయమని తెలిపారు. గాంధీజి కలలుగన్న స్వచ్ఛమైన, స్వావలంబనతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దామని కోరారు. దేశ నిర్మాణంలో భాగంగా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కోసం గాంధీజి చూపిన బాటలో నడుద్దామని కోరారు.స్వతంత్ర ద్వితీయ లాల్ బహూదుర్ శాస్ర్తీ నిరాడంబరతకు ప్రతిరూపమని తెలిపారు. దేశభక్తి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల పాత్రను గుర్తించి ఆయన ఇచ్చిన జై జవాన్-జై కిసాన్ నినాదం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుందని తెలిపారు. కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్లూ ఆయన చూపిన నాయకత్వం, కర్తవ్యనిష్ట అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి అంకితభావంతో పనిచేద్దామని కోరారు.
గాంధీ, లాల్ బహుదూర్లకు నివాళులర్పించిన సిఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)