- నేడు వెస్టిండీస్‌తో మూడో, చివరి వన్డే
- మ. 2.00గం.ల నుంచి
ఛండీగడ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్గో ఘన విజయం సాధించిన భారత్ ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. తొలి వన్డేలో ఇరుజట్లు 500కు పైగా పరుగులు చేస్తే, రెండో వన్డేలో ఏకంగా 800కు పైగా పరుగులు సాధించాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్లాట్‌పిచ్‌లపై బ్యాటర్లదే హవా. రెండు వన్డేలు ముగిసేసరికి ఇరుజట్లలో ఏడు శతకాలు నమోదయ్యాయి. శనివారం జరగనున్న మూడో వన్డేకు బ్యాట్‌కు, బంతికి సమన్వయం కుదిరేలా పిచ్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా టార్గెట్ క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో మొదట జట్టులో మార్పులు చేయాలని భావించింది. కానీ చివరి నిమిషంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దానిని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ప్రసిధ్ క్రిష్ణ స్థానంలో సిరాజ్ లేదా నితీశ్‌కుమార్ రెడ్డి జట్టులోకి రావడం ఖాయం. గువాహటి మ్యాచ్లో విండీస్ 405 పరుగులు చేసి గట్టి పోటీనిచ్చింది. జాన్ క్యాంప్‌బెల్, హోప్, అమీర్ జాంగూ శతకాలతో రాణించారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు, ఈ ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.








కామెంట్‌లు (0)