శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్టుబడులు, ఉద్యోగాలపై చర్చకు రండి

5 రోజుల క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జగన్‌‌కు మంత్రి లోకేష్‌ సవాల్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ ‌జగన్‌‌మోహన్‌రెడ్డికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌సవాల్‌ ‌విసిరారు. రెండు పార్టీల పెట్టుబడుల రికార్డును పోలుస్తూ ఎక్స్‌లో ఆదివారం ఆయన పొందుపరిచారు. 2024 నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రముఖ కంపెనీలు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. గూగుల్‌ రూ.1.33 లక్షల కోట్లు, ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ రూ.1.36 లక్షల కోట్లు, బ్రూక్‌ఫీల్డ్‌ రూ.1.06 లక్షల కోట్లు, రిలయన్స్‌ రూ.43 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయని తెలిపారు. రెన్యూ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైసిపి పిల్‌లు వేసిందన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్