శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాల సంజీవని, బాలామృతం కొనుగోళ్లకు కమిటీ

16 నవంబర్, 2026

ap-govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు బాల సంజీవని, బాలామృతం సరఫరా కోసం రాష్ట్రస్థాయి కొనుగోలు కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి ఎ సూర్యకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీకి మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలశాఖ సంచాలకుడు, మధ్యాహ్న భోజనం, పాఠశాల పారిశుధ్యశాఖ సంచాలకుడు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంచాలకుడు, ఆహార శుద్ధి సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి, సెర్ప్ ప్రతినిధి, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ ప్రతినిధి, ఎపి పాడి పరిశ్రమల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు (ఐసిడిఎస్) సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. బాల సంజీవని, బాలామృతం సరఫరాకు సంబంధించి ఇ - ప్రొక్యూర్‌మెంట్ విధానంలో పిలిచే టెండర్లను కమిటీ పరిశీలించి మూల్యాంకనం చేయనుంది. టెండర్లకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయడం, కొనుగోలు నిబంధనలు పాటించారా లేదా పరిశీలించడం, అర్హతలు, సాంకేతిక ప్రమాణాలను సమీక్షించడం, టెండర్లలో వచ్చిన ధరలను ప్రస్తుత మార్కెట్ ధరలు, అంచనా వ్యయంతో పోల్చి చూడటం కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం నిర్దేశించింది. టెండర్ల మూల్యాంకనం అనంతరం కాంట్రాక్టుల కేటాయింపునకు సిఫార్సులు చేయనుంది. బాలామృతం కొనుగోలుకు సంబంధించి టెండర్ కమిటీ ధరలను ఖరారు చేసిన తర్వాత వాటిని ఉన్నతస్థాయి అధికారుల కమిటీకి సిఫార్సుల కోసం సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్