శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మానవ అక్రమ నిరోధకంపై కమిటీలు

14 నవంబర్, 2026

sads
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, మానవ అక్రమ రవాణాను అరికట్టడం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులోని జి గణేష్‌ ‌కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, జువెనైల్‌ ‌జస్టిస్‌ ‌చట్టం-2015, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌ ‌శనివారం విడుదల చేసిన జిఓ 26లో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కమిటీకి స్ర్తీ, శిశు, వికలాంగ, వయోవృద్ధుల శాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్‌పర్సన్‌‌గా, సిఐడి విభాగం డిజిపి గానీ, ఎడిజిపి గానీ కో-ఛైర్‌పర్సన్‌‌గా ఉంటారు. మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ మెంబర్‌ ‌కన్వీనర్‌‌గా ఉండే ఈ కమిటీలో సభ్యులుగా మిస్సింగ్‌ ‌‌చిల్డ్రన్‌ స్టేట్‌ ‌నోడల్‌ ఆఫీసర్‌, మానవ అక్రమ నిరోధక విభాగం, కార్మిక, పాఠశాల విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. రైల్వే పోలీస్‌, రాష్ట్ర న్యాయ సేవా అధికారిక సంస్థ, సైబర్‌ ‌క్రైమ్‌, సిసిటిఎన్‌ఎస్‌ ‌విభాగం ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్‌ ‌ఛైర్‌‌పర్సన్‌‌గా, ఎస్‌‌పి లేదా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌కో-ఛైర్‌‌పర్సన్‌‌గా వ్యవహరిస్తారు. మానవ అక్రమ రవాణా విభాగం, బాలల సంక్షేమ కమిటీ, కార్మిక, విద్య, వైద్య, రైల్వే పోలీస్‌, చైల్డ్‌ ‌కేర్‌ ‌సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్