సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కడపలో రీపోలింగ్‌పై గందరగోళం..

1 గంట క్రితం

repolling
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 08:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పోలింగ్ కేంద్రానికి ఇంకా తాళాలే

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో రీపోలింగ్ ప్రారంభం కాకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎనిమిదో వార్డులోని పోలింగ్ కేంద్రానికి ఇంకా తాళాలు వేసి ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. జెండామాను వీధి గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన రీపోలింగ్ కు సిబ్బంది ఇంకా రాకపోవడంతో అనేక అనుమానాలు మొదలైయ్యాయి. రీపోలింగ్ కోసం ఓటర్లు, రాజకీయ నాయకులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నప్పటికీ పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. అసలు రీపోలింగ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌పై అధికారులు ప్రజలకు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. రీపోలింగ్ ప్రారంభంపై అధికారుల ప్రకటన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్