మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలి

3 రోజుల క్రితం

sajjala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసిపి నేతలకు సజ్జల ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రానున్న పంచాయతీ, పెండింగ్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్క సర్పంచ్‌, వార్డు స్థానం కూడా పోటీ లేకుండా వదిలిపెట్టకూడదని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారని పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి గ్రామంలో పార్టీ మద్దతుదారులు తప్పనిసరిగా పోటీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా, రాజకీయ పార్టీలకు గ్రామస్థాయిలో బలమైన పునాది ఏర్పడేది ఈ ఎన్నికల ద్వారానేనని వివరించారు. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మొత్తం అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలం పాటలను తలపించేలా ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం వస్తోందన్నారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. నామినేషన్ల దాఖలును అడ్డుకోవడం, అక్రమంగా తిరస్కరించడం, అభ్యర్థులను బెదిరించడం, పోలీసుల అధికార దుర్వినియోగం వంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే వీడియోలు, ఫొటోలు తదితర ఆధారాలను సేకరించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్