శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Tiger: పులి కదలికలపై నిరంతర నిఘా

6 రోజుల క్రితం

tiger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ.కొండూరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏ కొండూరులో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో శనివారం సమీక్షించారు.పులి కదలికలపై నిరంతరం నిఘా పెడుతూ, ప్రజల భద్రత భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధునాతన సాంకేతికతతోపాటు ఇతర రాష్ట్రాల నిపుణుల సహకారం తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పిసిసిఎఫ్‌, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్వీయ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు చేరవేయాలని తెలిపారు. స్థానిక అటవీ శాఖ బృందాలతో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ బృందాలతో విస్తృతంగా గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కదలికలను మరింత సమర్థవంతంగా గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను విస్తృతంగా వినియోగించాలని పేర్కొన్నారు. సమీపంలోని గ్రామాల్లో ప్రజల భద్రతకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, పశువుల కాపరులు, స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన సూచనలు చేయాలని చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక పులి ట్రాకింగ్, రెస్క్యూ బృందాలను రప్పించి ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ ఆపరేషన్‌లో ప్రజలకుగానీ, పులికిగానీ ఎలాంటి హాని కలగకూడదని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్