కావలిలో టిడిపి, వైసిపి నేతల బాహాబాహీ
ప్రజాశక్తి - నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 18వ వార్డు నుంచి వైసిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మక్కి కిరణ్ కుమార్ నామినేషన్ పత్రంలో పలు కాలమ్‌లు పూర్తి చేయకుండా వదిలేయడంతో అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో వైసిపి నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సుమారు 20 మంది అనుచరులతో కలిసి నామినేషన్ల పరిశీలన కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టిడిపి నాయకుడు జనిగర్ల మహేంద్ర యాదవ్, రామిరెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొని, ఇరుపక్షాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పి, కార్యాలయం నుంచి బయటకు పంపించారు.








కామెంట్‌లు (0)