మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎస్‌ఐఆర్‌ తరువాత 75 లక్షల ఓట్లు చేర్పు

23 నిమిషాల క్రితం

SIR.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ‌తరువాత తుది ఓటర్ల జాబితాలు ప్రచురించిన కొన్ని నెలల వ్యవధిలోనే మళ్లీ 75 లక్షల ఓట్లను చేర్చడం సంచలనంగా మారింది. ఇటీవల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్‌ఆర్‌) ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎస్‌ఎస్‌ఆర్‌ ‌తరువాత ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలలో ఈ 75 లక్షల కొత్త పేర్లను చేర్చారు. ఈ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటి లోనూ కొన్ని నెలల క్రితమే ఎస్‌ఐఆర్‌‌ను నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌‌కు ముందు ఈ రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 49.61 కోట్లుగా ఉండగా, ఎస్ఐఆర్ తర్వాత అది 45.22 కోట్లకు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ముసాయిదా ఎస్ఎస్ఆర్ జాబితాతో 45.96 కోట్లకు పెరిగింది. మొత్తం మీద 1.64 శాతం పెరుగుదల నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లో సంఖ్యాపరంగా అత్యధికంగా 18.84 లక్షల పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారు. గోవాలో అత్యధికంగా 3.01 శాతం పేర్లు చేర్చారు. 2025లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపట్టిన మొదటి రాష్ట్రమైన బీహార్‌లో 13.89 లక్షల పేర్లు చేర్చారు. రాజస్థాన్‌లో 11.48 లక్షలకు పైగా ఓటర్లు చేర్చారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్ (1.19 లక్షలు), మధ్యప్రదేశ్ (8.9 లక్షలు), తమిళనాడు (10.39 లక్షలు) ఉన్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌తో సహా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అక్టోబర్ 15న ఎస్‌ఎస్‌ఆర్‌‌ను తొలిసారిగా ప్రకటించారు. ఈ నెల 5న మరో ఆరు రాష్ట్రాలకు దీనిని విస్తరించారు. కర్ణాటక, మేఘాలయలో కూడా ఎస్‌ఎస్‌ఆర్‌‌ను నిర్వహిస్తామని అధికారులు ఈ నెల 16న ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్