మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆన్ లైన్ బెట్టింగ్ లతో అప్పులపాలు - దంపతుల ఆత్మహత్య

16 గంటల క్రితం

Couple commits suicide after falling into debt due to online betting.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గోస్పాడు (నంద్యాల) : ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం నంద్యాలలో జరిగింది. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరంలో మేకల శేషాద్రి (31), అంజిత (26) లకు మహేంద్ర (4), మోక్షిత (2) సంతానం. శేషాద్రి నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న డబ్బుతోపాటు ప్రతి నెలా వచ్చే జీతాన్ని కూడా ఆన్‌లైన్‌ బెట్టింగ్ లలో పెట్టాడు. లాభాలు రాకపోవడంతో అత్యాశకు పోయి స్నేహితులు, తెలిసిన వారి వద్ద రూ.5 లక్షలకు పైగా అప్పులు చేశాడు. తండ్రి, మామ కొంత మేర ఆర్థిక సాయం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పులు అధికం కావడం, వడ్డీలు పెరిగిపోవడంతో పాటు రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం అయ్యాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో శేషాద్రి, అంజిత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు బిడ్డలతో శనివారం రాత్రి కలసి భోజనం చేశారు. పిల్లలను పక్క గదిలో ఉంచి తలుపు వేశారు. మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి వరకు ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు ఉదయాన్నే అచేతన స్థితిలో ఉండటాన్ని చూసి ఆ పసి హృదయాలు అల్లాడిపోయాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్