ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజులుగా హౌస్ అరెస్టు చేయటమే కాకుండా ఆమెను కలుసుకోవడానికి కూడా ఎవరినీ అనుమతించకపోవడం దారుణమని తెలిపారు. చివరికి బీఫారాలు తీసుకోవడానికి వచ్చిన వారిని కూడా ఆపడంతో బయటకొచ్చి బీఫారాలు ఇస్తానన్నా అంగీకరించకుండా కిందకు తోసివేయడం హేయమని పేర్కొన్నారు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీస్ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.








కామెంట్‌లు (0)