ప్రజాశక్తి - యంత్రాంగం : మున్సిపల్ కార్పొరేషన్ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పలువురు సిపిఎం అభ్యర్థులు ప్రమాణం చేశారు. విజయవాడ 52వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్‌గా బోయి సత్యబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సత్యబాబు తన సమీప ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థిపై 1,412 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన వరుసగా మూడోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అంతేగాకుండా 52వ డివిజన్‌లో సిపిఎంకు వరుసగా ఐదోసారి విజయాన్ని అందించారు. ఎన్‌టిఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు సిపిఎం కౌన్సిలర్ గా మేడిపల్లి నాగమణి ప్రమాణం స్వీకారం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) 105వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌గా ఎం.కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విశాఖ నగరంలో మంచినీటి సమస్యతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కార్మికుల సమస్యలు, పన్నుల భారాలపై కౌన్సిల్‌లో గళమెత్తుతానని స్పష్టంచేశారు.










కామెంట్‌లు (0)