శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎబి. వెంకటేశ్వరరావు

1 గంట క్రితం

mayor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మద్దతు...

- నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీకి మూడు పార్టీల నిర్ణయం

- అభ్యుదయ శక్తులను ఏకం చేస్తాం, డి. కాశీనాథ్, జి. కోటేశ్వరరావు

ప్రజాశక్తి –ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేట్, ప్రజావ్యతిరేక శక్తులను తిప్పికొట్టేందుకు లౌకిక, వామపక్ష పార్టీలు చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో సిపిఎం , సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని శనివారం జరిగిన నాయకుల సమావేశం నిర్ణయించింది. నగర మేయర్ ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ డిజిపి ఎబి. వెంకటేశ్వరరావును బలపరచాలని ఈ మూడు పార్టీలు సంయుక్తంగా తీర్మానించాయి. అభ్యుదయ భావాలు కలిగిన పలువురు స్వతంత్ర వ్యక్తులు కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి. కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు సంయుక్తంగా వివరాలను వెల్లడించారు. నగర ప్రజలపై మోపిన భారాలు, స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకు వీలుగా ఈ మూడు పార్టీల పొత్తును ఖరారు చేసినట్లు తెలిపారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయాల్సిన కార్పొరేటర్ స్థానాలపై ఇప్పటికే ఒక ఉమ్మడి అవగాహన కుదిరిందని, మిగిలిన స్థానాలపై ఇతర వామపక్ష పార్టీలతోనూ చర్చలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. నగర సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజాపక్షం వహించేందుకు మేయర్ అభ్యర్థిగా ఎబి. వెంకటేశ్వరరావును, వివిధ డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేయబోయే మూడు పార్టీల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నగర ప్రజానీకానికి వారు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్