- తుమ్మపూడిలో ముగిసిన అంత్యక్రియలు
- పుష్పలీల భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకుల నివాళులు
గుంటూరు: సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. రవి భార్య మేరీ పుష్పలీల సోమవారం తెల్లవారుజామున మంగళగిరి మండలం ఎర్రబాలెంలో కన్నుమూశారు. ఆమె స్వగ్రామమైన దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో అంత్యక్రియలు నిర్వహించారు. మేరీ పుష్పలీల భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్. బాబూరావు, డి.రమాదేవి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎం. రవికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.








కామెంట్లు (0)