- కొన్ని వార్డుల్లో ఏకగ్రీవం
ప్రజాశక్తి - యంత్రాంగం : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పలు వార్డుల్లో సిపిఎం మద్దతుదారులు గెలుపొందారు. అనంతపురం జిల్లా కుక్కలపల్లి పంచాయతీలో రాజీవ్ కాలనీ 6వ వార్డు మెంబర్‌గా గంగమ్మ, 9వ వార్డు మెంబరుగా పుష్పకుమార్ గెలిచారు. ఇర్ఫాన్, మన్నీల రామాంజినేయులు ఏకగ్రీవమయ్యారు.
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం మైలపల్లి గ్రామపంచాయతీ పదో వార్డు మెంబర్‌గా పందికాళ్ల మణి గెలుపొందారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ ఎనిమిదో వార్డులో కె.గంగయ్య, ఐదో వార్డులో హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్లపూడి ఐదో వార్డులో జీ.వెంకటమ్మ, అంజూరు ఆరో వార్డులో మౌనిక, అంజూరుపాలెం ఏడో వార్డులో యామావతి, ఆధరం ఎనిమిదో వార్డులో చిట్టెమ్మ, ఎంఎ రాజులకండ్రిగ ఐదో వార్డులో టి.సుబ్బమ్మ విజయం సాధించారు. రాగిగుంట ఐదో వార్డులో 290 ఎకరాల భూ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంఘం అధ్యక్షురాలు కుప్పమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయపేడు మూడో వార్డులో పి.చిరంజీవి గెలుపొందారు. సత్యవేడు మండలం అంబాకం పంచాయతీలో పదో వార్డులో వి.గౌరీ, తొమ్మిదో వార్డులో పి.రూప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుచ్చినాయుడుకండ్రిగ మండలం కారణిమిట్ట ఒకటో వార్డులో దూడల సుబ్బయ్య విజయం సాధించారు. తొట్టంబేడు మండలం బోనుపల్లి 2వ వార్డులో గంధం పీరమ్మ, చియ్యవరం పదో వార్డులో పెంచలయ్య ఏకగ్రీవంగా గెలుపొందారు.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం మాదాలవారిగూడెం ఐదో వార్డు సభ్యురాలిగా చిలకా మరియమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉంగుటూరు మండలం ఎలుకపాడు రెండో వార్డు సభ్యునిగా ప్రొద్దుటూరు యాకోబు, ఉంగుటూరు గ్రామ ఆరో వార్డు సభ్యునిగా ఉజ్జవరపు లెనిన్‌బాబు, లంకపల్లి గ్రామ నాలుగో వార్డు సభ్యులుగా తలారి సంతోషమ్మ గెలుపొందారు. బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామ నాలుగో వార్డు సభ్యునిగా బర్రె లెనిన్ ఎన్నికయ్యారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడిలో నాలుగో వార్డులో న్యాయవాది యార్లగడ్డ తనూజ, ఏడో వార్డులో వల్లభాపురం మహేష్‌బాబు, తొమ్మిదో వార్డులో దున్నా సుదర్శనరావు గెలుపొందారు. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడు పంచాయతీలో ఆరో వార్డులో సయ్యద్ లాల్‌బి, తొమ్మిదో వార్డులో బందెల అరుణ ఏకగ్రీవమయ్యారు.
అల్లూరి జిల్లా జికె.వీధి పంచాయతీ ఒకటో వార్డులో కుర్ర ప్రసన్నకుమార్, ఎ.ధారకొండ పంచాయతీ నాలుగో వార్డులో తెల్లన్నరావు, ఐదో వార్డులో సత్యవతి గెలుపొందారు. ఆరో వార్డులో గణపతి విజయం సాధించారు. దేవరపల్లి పంచాయతీలో గడుతురు సత్యనారాయణ వార్డు సభ్యునిగా ఏకగ్రీవమయ్యారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డిలో ముగ్గురు, రాజవొమ్మంగిలో ఒకరు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు.
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని కొత్తూరు, వెంకటరమణ పేట గ్రామ పంచాయతీల పరిధి కొత్తూరు పంచాయతీలో 2వ వార్డులో గొల్ల సత్యనారాయణ గెలుపొందారు. తొమ్మిదో వార్డు అభ్యర్థి పాడి అప్పలకృష్ణ, 11వ అవార్డు అభ్యర్థి దండుపాటు ఎర్రినాయుడు విజయం సాధించారు.
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం రామవరం పంచాయతీలో ఏడో వార్డులో రెడ్డి విజయ, ఎనిమిదో వార్డులో రెడ్డి లక్ష్మి గెలుపొందారు. బొండపల్లి మండలం గొల్లపాలెం పంచాయితీలో తొత్తడి పైడినాయుడు ఎనిమిదో వార్డులో సభ్యునిగా ఏకగ్రీవం ఎన్నికయ్యారు.
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట పంచాయతీలో ఐదో వార్డులో కె.సుజాత, ఆరో వార్డులో బిడ్డిక శ్రీను, ఏడో వార్డులో హిమరిక దినేష్, ఎనిమిదో వార్డులో కడ్రక ప్రసన్న, తొమ్మిదో వార్డులో ఆరిక సుమిత్ర, 13వ వార్డులో సరోజిని కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీలో మండంగి గొల్లమ్మ రెండో వార్డులో, మండంగి శ్రీను ఎనిమిదోవార్డులో సభ్యులుగా గెలుపొందారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు ఐదో వార్డులో ఎర్రం గోవిందరెడ్డి గెలుపొందారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం ఎనిమిదో వార్డులో చింతకుంట్ల వినోద్, పెరిదేపి మూడో వార్డులో సభ్యునిగా లక్కిపోగు కల్పన, రెండో వార్డులో అంగలకుర్తి కోమలి గెలుపొందారు. పంగులూరు మండలం చందలూరు రెండో వార్డులో ఎన్.ప్రభాకర్, కొత్తపట్నం తొమ్మిదో వార్డులో పట్టపు సునీల్, సంతనూతలపాడు మండలం కామేపల్లివారి పాలెం ఆరో వార్డులో కర్రె సామ్రాజ్యం విజయం సాధించారు.
మార్కాపురం జిల్లా పామూరు రావిగుంటపల్లి పదో వార్డులో ఎండ్లూరి ఆదిలక్ష్మి, 12వ వార్డులో సయ్యద్ షర్మిల, సిఎస్‌పురం మండలం వెంగనగుంట ఒకటో వార్డులో వడ్డె మల్లేశ్వరి, అరివేముల ఒకటో వార్డులో గురజాల సుజాత, ఐదో వార్డులో మారంరెడ్డి రత్నారెడ్డి, కంభం ఐదో వార్డులో బి.రోశయ్య, కొమరోలు 15వ వార్డులో వై.శింగరయ్య గెలుపొందారు.








కామెంట్‌లు (0)