గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్..

1 గంట క్రితం

weather
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 06:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రేపు నరసాపురం-పూరీ మధ్య తీరం దాటే అవకాశం

ప్రజాశక్తి - తాడేపల్లి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ కొనసాగుతోంది. గత ఆరు గంటలుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదులుతోంది. ప్రస్తుతం నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 580 కిలోమీటర్లు, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాన్ రేపు మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని అధికారులు హెచ్చరించారు.

తుపాన్ ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించారు. తుపాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్