గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోల్‌కతాలో ఎస్‌ఎఫ్‌ఐ బుక్‌స్టాల్‌పై ఎబివిపి బాంబు దాడి

58 నిమిషాల క్రితం

కోల్‌కతాలో ఎస్‌ఎఫ్‌ఐ బుక్‌స్టాల్‌పై ఎబివిపి బాంబు దాడి
-  పుస్తకాలు ధ్వంసం, పుస్తకప్రియుల ఖండన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 06:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పుస్తకాలు ధ్వంసం, పుస్తకప్రియుల ఖండన

కొల్‌‌కతా : బిజెపి డబుల్ ఇంజన్ ఏలుబడిలోని పశ్చిమ బెంగాల్‌‌లో పుస్తక షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం కొల్‌‌కతాలో ఎబివిపి గూండాలు రెచ్చిపోయారు. కాలేజ్ స్ట్రీట్ ప్రాంతంలో భారత విద్యార్ధి ఫెడరేషన్‌ (ఎస్ఎఫ్‌ఐ) ఏర్పాటు చేసిన బుక్‌‌స్టాల్‌‌పై బాంబులతో దాడి చేశారు. అన్ని అనుమతులతో

బుధవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌ఐ ఈ బుక్‌‌స్టాల్‌‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ బుక్‌‌స్టాల్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎబివిపి గూండాలు అక్కడికి చేరుకుని, అనుమతి పత్రం చూపించాలని ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులను వేధించారు. పోలీసుల ఇచ్చిన అనుమతి గురించి ఎస్ఎఫ్ఐ సభ్యులు ఎబివిపి గూండాలకు వివరించారు. అయినా వినకుండా కమ్యూనిజం చరిత్ర, భావజాలానికి సంబంధించిన పుస్తకాలపై ఎబివిపి గూండాలు అసభ్యంగా మాట్లాడారు. బుక్‌‌స్టాల్‌‌ను, పుస్తకాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు వారించడంతో వారిపై భౌతిక దాడులకు దిగారు. బుధవారం రాత్రి ఏకంగా బాంబులతో బుక్‌‌స్టాల్‌‌పై దాడి చేశారు. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఆందోళనలతో అక్కడ నుంచి పరుగులు తీశారు. కాగా,బుక్‌‌స్టాల్స్‌‌పై దాడి చేయడం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఎబివిపిలకు ఇదే మొదటిసారి కాదు. ఇటీవల దుర్గాపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన బుక్‌‌స్టాల్స్‌‌పై బిజెపి గూండాలు దాడులకు దిగారని, పుస్తకాలను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ దాడులను పుస్తకప్రియులు ఖండించారు. కోల్‌కతాలో ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసిన పుస్తకాల స్టాల్‌పై ఏబీవీపీ, మితవాద సంస్థలు బాంబులు వేస్తూ, దాడి చేస్తున్నాయి.

పుస్తకాలపై దాడి హేయం : ఎస్‌ఎఫ్ఐ

పుస్తకాలపై సంఘ్‌ ‌పరివార్‌ ‌దాడి హేయమైందని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్ఐ) కేంద్ర కమిటి తెలిపింది. ఈ మేరకు సోషల్‌ ‌మీడియా ఎక్స్‌‌లో పోస్టు చేసింది. ఎబివిపి దాడులను సిఇసి ఖండించింది. దేశంలో ఒక వైపు నేరస్తులకు క్లీన్‌ ‌చిట్‌‌లు ఇస్తూ, మరోవైపు పుస్తకాలను తగలబెడుతున్నారని విమర్శించింది. ఇది ఫాసిస్టుల భావజాలానికి నిదర్శమని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఎబివిపి దమనకాండను పశ్చిమ బెంగాల్ ప్రజలు వ్యతిరేకించాలని, ఐక్యంగా ఈ దాడులను ఎదుర్కోవాలని కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్