గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపరంకుండ్రంలో సాంప్రదాయ ప్రదేశంలోనే కార్తీక దీపం

43 నిమిషాల క్రితం

తిరుపరంకుండ్రంలో సాంప్రదాయ ప్రదేశంలోనే  కార్తీక దీపం
: సిపిఎం డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

: సిపిఎం డిమాండ్‌

మదురై : తమిళనాడులోని తిరుపరంకుండ్రంలో తరతరాలుగా కార్తీక దీపాన్ని వెలిగిస్తున్న సాంప్రదాయ ప్రదేశంలోనే కార్తీక దీపం వెలిగించాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. మదురైలో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఎం నాయకులు ఈ డిమాండ్‌ ‌చేశారు. సంఘ్ పరివార్ తన రెచ్చగొట్టే ప్రచారాలు, రాజకీయ సమీకరణల ద్వారా ఈ అంశాన్ని మతపరంగా మలచడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. దర్గా సమీపంలోని రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించి, సుదీర్ఘకాలంగా పాటిస్తున్న సంప్రదాయాన్ని మత ఉద్రిక్తతలకు మూలంగా మారుస్తోందని ఖండించారు. గత ఏడాది జరిగిన పరిణామాలు, ప్రజలను విభజించి, మదురై పట్టణంలో మత సామరస్య సంప్రదాయానికి భంగం కలిగించే ప్రయత్నాలను బట్టబయలు చేశాయని తెలిపారు. ఈ బహిరంగ సభకు సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎంపి వెంకటేశన్, మధుక్కూర్ రామలింగం, మదురై నగర జిల్లా కార్యదర్శి ఎం గణేసన్, మదురై జిల్లా కార్యదర్శి కె రాజేంద్రన్, డిప్యూటీ మేయర్ నాగరాజన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ కె పొన్నుతై, టి చెల్లకన్ను, ఎస్ బాల హాజరయ్యారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏకం కావాలని, లౌకికవాదాన్ని, ఈ ప్రాంతపు శాంతియుత సహజీవన వారసత్వాన్ని కాపాడుకోవాలని సిపిఎం నాయకులు ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్