సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దూసుకొస్తున్న ''మురసు'' తుఫాన్

1 గంట క్రితం

cyclone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 08:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- తీవ్ర తుపానుగా బలపడిన మురసు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల సమయానికి 13.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాన్ చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము మధ్య నెల్లూరు, నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నేడు, రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్