ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబంగాళాఖాతంలో తుపాను ముప్పు

24 అక్టోబర్, 2026

Another depression – rains in AP..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 10:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రేపట్నుంచి విస్తారంగా వర్షాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన సుస్పష్టమైన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి ప్రఖర్ జైన్ వెల్లడించారు. సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని శనివారం ఒక ప్రకటనలో ‌పేర్కొన్నారు. ఈ తుపాను బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వదంతులను ప్రజలు నమ్మొద్దని, వాటిని ఇతరులకు వ్యాప్తి చేయొద్దని సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్‌‌టిజిఎస్‌ జారీ చేసే అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. తుపానుకు సంబంధించిన తాజా సమాచారం, అత్యవసర సహాయం కోసం ఎస్‌‌డిఎంఎ టోల్‌ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్