ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటమి బయంతోనే జగన్‌ ఆరోపణలు

3 గంటల క్రితం

ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 08:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతుంటే, మహిళలకు, బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే జగన్ రెడ్డి అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేస్తూ, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతున్నారని తెలిపారు.

అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి జగన్ ఓటమి భయంతో ఎన్నికల ప్రక్రియపై తప్పుడు ఆరోపణలు చేస్తూ

కొత్త డ్రామాలకు తెరతీశారన్నారు.

జగన్‌ ‌నాటకాలు బట్టబయలు: బోండా ఉమా

పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ నాటకాలు బట్టబయలయ్యాయని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే.. ఒక్క పులివెందులలోనే ఎందుకు వివాదాలు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా పులివెందుల ప్రజలు భయాందోళనల మధ్య ఓటు వేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

బిసిల అభ్యున్నతిని అడ్డకుంటున్నారు : గల్లా మాధవి

రాజకీయాల్లో అట్టడుగు వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికలు జరుగుతుంటే, దానిని అడ్డుకునే కుట్రలకు జగన్‌ ‌తెరతీశారని టిడిపి ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్