ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవినోద్ బాబుకు కన్నీటి వీడ్కోలు

3 గంటల క్రితం

సిపిఎం నాయకులు వినోద్ బాబుకు కన్నీటి వీడ్కోలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 08:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పంగులూరు (ప్రకాశం జిల్లా) : సిపిఎం సీనియర్ నాయకులు రాయిని వినోద్ బాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. కేన్సర్ వ్యాధితో శనివారం రాత్రి వినోద్ బాబు మరణించిన విషయం తెలిసిందే. భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం పంగులూరులోని ఆయన స్వగృహం వద్ద ఉంచారు. వినోద్‌‌బాబు సిపిఎం పంగులూరు మండల కార్యదర్శిగా, బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి, అనేక సమస్యలను పరిష్కరించి, పేదల పక్షాన చివరి వరకూ నిలిచారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సాయంత్రం ఆయన స్వగృహం నుండి ప్రారంభమైన అంతిమయాత్రలో సిపిఎం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, సీనియర్ నాయకులు నాగబోయిన రంగారావు, నాయకులు వై.సిద్ధయ్య, జాలా అంజయ్య, ప్రకాశం, బాపట్ల జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ కమ్యూనిస్టుగా జీవించిన వినోద్‌బాబు కన్నుమూయడం రైతు ఉద్యమానికి, సిపిఎంకు తీరని నష్టమని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్