శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం

1 గంట క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాపర్ వైర్ చోరీ

ప్రజాశక్తి - ముద్దనూరు : పొలానికి నీరు అందించేందుకు రైతు పొలంలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్ దోచుకెళ్లారు. బాధిత రైతు తులసయ్య తెలిపిన వివరాల ప్రకారం..తనకు కొలవలి గ్రామంలో 12 ఎకరాలు పొలం ఉందన్నారు. ప్రస్తుతం చీని పంట సాగు చేసినట్లు తెలిపారు. మోటార్ ద్వారా పొలానికి నీరు అందించేందుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్ లో ఉండే కాపర్ వైర్ చోరీకి గురి కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ.. విద్యుత్ తీగలు, వెల్డింగ్ కట్ చేసి కాపర్ వైర్ దోచుకెళ్లారని వాపోయారు. విద్యుత్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు. మండలంలో పలు చోట్ల రైతులు పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్ వైర్ దోచుకెళ్లిన ఘటనలు చోటు చేసుకోవడంతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్