గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్రిక్తంగా మారిన దేవరగట్టు బన్ని ఉత్సవం

36 నిమిషాల క్రితం

karnool
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -కర్నూలు : జిల్లాలో దేవరగట్టులో నిర్వహించే బన్ని ఉత్సవం మరోసారి ఉద్రిక్తంగా మారింది. దాడులు ప్రతిదాడులతో ఇరు వర్గాల మధ్య సంప్రదాయ సమరం కాస్తా రణరంగంగా మారింది. వివరాల ప్రకారం.. విజయదశమి సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవం (కర్రల సమరం) ఈ ఏడాది తిథులు, నక్షత్రాల కారణంగా బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఉత్సవం సందర్భంగా సుమారు 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామస్తులు పరస్పరం రాళ్లు, కర్రలు, దివిటీలతో దాడికి దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ దాడులను నిలువరించలేకపోయారు. దీంతో ఒకరు మరణించగా, వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆదోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్