ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చేనేత, జౌళి శాఖ అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రతిపాదనలు, క్లెయిమ్‌లను పరిశీలించి పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి కమిటీలను మరో ఐదేళ్ల కాలానికి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు 2024 నవంబర్ 6 నుంచి ఐదేళ్ల పాటు కొనసాగనున్నాయి. జిల్లా కలెక్టర్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చేనేత, వస్త్ర శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు, విజయవాడ వర్క్‌షాప్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా సహకార ఆడిట్ అధికారి, ఏపీసీవో డీఎంఓ సభ్యులుగా ఉంటారు. చేనేత, వస్త్ర శాఖ సహాయ సంచాలకుడు సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులు, చేనేత కార్మికుల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. జిల్లా స్థాయి కమిటీలు ప్రతి నెలా ఒకసారి సమావేశమై చేనేత, వస్త్ర శాఖ పథకాల అమలుకు సంబంధించిన ప్రతిపాదనలు, క్లెయిమ్‌లను పరిశీలించనున్నాయి.
పథకాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీలు
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)