ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశాలకు నిధులు మళ్లింపు - సిఎ పై కేసు నమోదు

1 గంట క్రితం

Diversion of funds abroad – Case registered against CA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌) : షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు రూ.186 కోట్లు పంపించిన చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ దామా చిన్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఆదాయపు పన్నుల శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... గుంటూరు పట్టణం అరండల్‌పేటకు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దామా చిన్న వెంకట సుబ్రహ్మణ్యం చట్ట ప్రకారం తగిన ధ్రువీకరణ చేయకుండా ధ్రువపత్రా­లు జారీ చేయడం ద్వారా విదేశాలకు మోసపూరితంగా నిధుల బదిలీ (ఔట్‌ వార్డ్‌ ఫారిన్‌ రిమిటెన్సెస్‌) జరగడానికి సహకరించినట్లు సమాచారం రావ­డంతో ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ తమ సిబ్బందితో ఈ నెల 17న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దేశం వెలుపలికి నిధులను పంపించేందుకు, రిమిటర్‌ సంస్థలకు, షెల్‌ / బోగస్‌ కంపెనీల పేరుతో సరైన ధ్రువీకరణ లేకుండానే ధ్రువపత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. దేశ, విదేశీ మారక నిల్వల నిర్వహణకు బాధ్యత వహించే ఆర్‌బిఐ, విదేశాలకు నిధులను పంపే సందర్భంలో ఆథరైజ్డ్‌ డీలర్స్‌ ద్వారా పాటించాల్సిన మార్గదర్శకాలను, ఆర్‌బిఐ నిబంధనలు పాటించకుండా ధ్రువపత్రాలు జారీ చేశారని, ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదని గుర్తించి ఈ మేరకు చిన్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఆదాయపు పన్నుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రాత్రి చిన్న వెంకట సుబ్రహ్మణ్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్