సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జగన్ కాలనీలో పోలీసుల తనిఖీలు

23 ఆగస్టు, 2026

Police inspections in Jagan Colony
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : స్థానిక జగన్ కాలనీలో ఈగల్ టీమ్ తో కలిసి పోలీసులు ఆదివారం తనిఖీలు చేశారు. కాలనీలోని గృహాలను పరిశీలించి రికార్డులు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. మత్తు పదార్థాలపై యువతకు, ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘునాథరావు మాట్లాడుతూ ... గంజాయి వంటి మత్తు పదార్థాలను ఎవరైనా అమ్మినా, రవాణా చేసిన 1972, 112కు సమాచారం ఇవ్వాలన్నారు. మీ పిల్లలు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా వారి ప్రవర్తనను పరిశీలించుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని అన్నారు. అద్దెకు ఎవరైనా వస్తే వారి వివరాలు తీసుకున్నాకే ఇవ్వాలన్నారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్