- అనుమతి లేకుండా పాఠశాలలో ప్రవేశించారంటూ ఆరోపణ
లాతూర్ : అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించారని, ఉపాధ్యాయుల్ని బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో మహారాష్ర్టలో సిజెపి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. లాతూర్ జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు సయ్యద్ శంషాద్‌బానో ఖైరతాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఔసా పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అభిజీత్ దీప్కే, అతని అనుచరులు అనుమతి లేకుండా పాఠశాలలోకి ప్రవేశించి, విద్యార్థుల మధ్య కూర్చుని వారిని పలు ప్రశ్నలు అడిగారని, తద్వారా తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు. మరొక పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకొచ్చి తమ తరగతుల్లో కూర్చొపెట్టారని కూడా ఫిర్యాదులో తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132, 329(3), 351(2), 356(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులను నియమించాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ‘స్కూల్ థిక్ కరో’ పేరుతో ప్రచారోద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)