శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళలపై సైబర్‌ దాడులను ఉపేక్షించొద్దు...

14 నవంబర్, 2026

మహిళలపై సైబర్‌ దాడులను ఉపేక్షించొద్దు
- ఆన్‌లైన్‌ వేధింపులకు అడ్డుకట్ట వేయాలి
- మహిళా సంఘాల ఐక్య వేదిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 10:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆన్‌లైన్‌ వేధింపులకు అడ్డుకట్ట వేయాలి

- మహిళా సంఘాల ఐక్య వేదిక

ప్రజాశక్తి - విజయవాడ: సోషల్‌ మీడియా వేదికగా మహిళలపై అసభ్యకర, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎంతమాత్రం ఉపేక్షించరాదని మహిళా సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. ఇటీవల సుమారు 350 మంది జనసేన కార్యకర్తలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలోని మహిళలతో పాటు సినీ నటులు అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్‌‌టిఆర్‌ కుటుంబాలకు చెందిన మహిళలపై అత్యంత అసభ్యకరమైన భాషలో వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, సామాజిక కార్యకర్త డాక్టర్‌ వసుంధర మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల అంశంపై రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సిన సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని నీచమైన భాషతో దూషించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఆన్‌లైన్‌ వేధింపులు కేవలం వ్యక్తిగత దూషణలుగా చూడరాదని, చట్టరీత్యా శిక్షార్హమైన నేరంగా చూడాలన్నారు. తమ కుటుంబాల్లోని మహిళలకు వర్తించే గౌరవం, సంస్కారం ఇతర మహిళలకు కూడా వర్తిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హితవు పలికారు. ఈ ఘటనపై టిడిపి కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించాలని, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గా భవాని, పిసిసి ప్రధాన కార్యదర్శి ఖుర్షీదా బేగం, రాష్ట్ర ఆర్గనైజేషన్‌ కార్యదర్శి దుర్గాంబ, అమలశ్రీ, హైకోర్టు న్యాయవాది స్వప్న, సిఐటియు రాష్ట్ర నాయకులు రమాదేవి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ, రాష్ట్ర సభ్యులు దుర్గ, శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్