- ఆర్టిజిఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలు నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం పిజిఆర్‌ఎస్ విధానం ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేరకు పరిష్కరించగలుగుతున్నామని, మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలని సిఎస్ సాయి ప్రసాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పరిష్కరించే విషయంలో ఉద్యోగులకు, అధికారులకు జవాబుదారీతనం ఉండేలా చూడాలన్నారు. వివిధ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జిఒపై ఈ తరహా దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమర్ధంగా సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)