ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టభద్రుల కర్మాగారాలుగా మారొద్దు

03 అక్టోబర్, 2026

పట్టభద్రుల కర్మాగారాలుగా మారొద్దు 
- భాషా వికాస కేంద్రాలుగా వర్ధిల్లాలి: ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు
ప్రజాశక్తి - కల్చరల్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- భాషా వికాస కేంద్రాలుగా వర్ధిల్లాలి: ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు

ప్రజాశక్తి - కల్చరల్ : తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు పట్టభద్రులను తయారు చేసే కర్మాగారాలుగా కాకుండా భాషా సాంస్కృతిక వికాసానికి కేంద్రంగా నిలవాలని భారత పూర్వ ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్ టి ఆర్ కళా మందిరంలో విశ్వవిద్యాలయ విస్తరణ సేవా విభాగం నిర్వహణలో వివిధ ప్రక్రియల్లో ప్రతిభావంతులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు పురస్కారాలు బహుకరించి మాట్లాడారు భాష శ్వాస లాంటిది అని అమ్మ వంటిది మాతృభాష అని చెప్పారు. తల్లితండ్రులు తమ పిల్లలకి తప్పనీ సరిగా తెలుగు భాషను సంప్రదాయ కళలు నేర్పించాలి అని సూచించారు. ప్రాథమిక విద్యాబ్యాసం తెలుగు భాష లోనే ఉండాలి అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. అధ్యక్తత వహించిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య నిత్యానంద రావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిభా వంతులును నిపుణులు సంఘం ఎంపిక చేసినట్లు తెలిపారు. పురస్కారంగా 30, 116 నగదు సత్కార పత్రం అందజేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు పురస్కార గ్రహీత లని పరిచయం చేసారు. పురస్కారాలు అందుకున్న వారు: కోట్ల వెంకటేశ్వర రెడ్డి(కవితా విభాగం)ఆచార్య యెన్ భక్త భక్త వాక్చల రెడ్డి(విమర్శ) కూరెళ్ళ శ్రీనివాస్(చిత్రలేఖనం) ఎ ఎస్ ప్రకాష్(శిల్ప కళ) డాక్టర్ హెచ్ అనిత( నృత్యం) దుడ్డు సీతారామయ్య(సంగీతం) డాక్టర్ వై నాగేశ్వర రావు (పత్రికా రంగం) సురభి వెంగమాంబ(నాటక రంగం) తూర్పాటి సాలమ్మ(జానపద కళ) డాక్టర్ పట్వార్ధను(అవధాన ప్రక్రియ) ఆచార్య కాత్యాయని విద్మహే(ఉత్తమ రచయిత్రి) కస్తూరి మురళీకృష్ణ(నవలా విభాగం).

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్