ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

SIR: 44.89 లక్షల ఓట్లు తగ్గాయి!

1 రోజు క్రితం

Draft electoral roll released in AP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆగస్టు 30వరకు క్లెయిమ్ లు, ఫిర్యాదుల స్వీకరణ

- సెప్టెంబర్ 28వరకు
క్షేత్ర స్ధాయిలో విచారణ

- అక్టోబర్ 3న 
తుది జాబితా విడుదల

- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ‌కార్య్రకమంలో గతంతో పోలిస్తే 44.89 లక్షల ఓట్లు తగ్గాయి. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో44,89,488 మంది నుండిఎన్యుమరేషన్‌ ‌ఫారాలు అందే అవకాశం లేదని (అన్‌ ‌కలెక్టబుల్‌) నిర్ధారించినట్లు చెప్పారు. వీరిలో మరణించిన వారు 15.22లక్షలు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు వారు 22.30లక్షలు, డబుల్ ఎంట్రీలు 7. 37లక్షల ఓట్లుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. డబుల్‌ ఎంట్రీలు ఉన్న వారికి ఒక చోట ఓటును కొనసాగించినట్లు తెలిపారు. మొత్తం ఓట్లలో 10.78 శాతం ఓట్లు అన్‌ ‌కలెక్టబుల్‌ ‌జాబితాలో ఉన్నట్లు తేలిందని చెప్పారు. రాష్ట్రంలో సర్‌ ‌ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా, 3,71,38,182 (89.22శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి అందించారని తెలిపారు. వీరిఇలో పురుష ఓటర్లు 1,82,06954, మహిళా ఓటర్లు 1,89,28,492, థర్డ్ జెండర్ 2,736 మంది ఉన్నట్లు తెలిపారు. ఆన్ కలెక్టబుల్ జాబితాలో పురుష ఓటర్లు 21,89,783గా నమోదుకాగా, మహిళా ఓటర్లు 22,99,035, థర్డ్ జెండర్ 694 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాసై జులై 31 నుంచి ఆగస్టు30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 28 వరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారి పేర్లను అక్టోబరు 3న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో చేరుస్తామని తెలిపారు. 28 జిల్లాల్లో జిల్లా ఎన్నికల అధికారులు, ఇఆర్ఒలు 175మంది, ఎఇఆర్ఒ 1079, బిఎల్ఒ సూపర్ వైజర్లు 4650, బిఎల్ఒలు 46,397మంది ఇంటింటి సర్వేలో పాల్గొన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన బిఎల్ఎలు వైసిపి 45,973, టిడిపి 44,603, బిజెపి 27,583, జనసేన 8,988, సిపిఎం 364, కాంగ్రెస్ 356, బిఎస్ పి1, ఆమ్ ఆద్మీ 1చొప్పున మొత్తంగా 1,27,863 మంది బిఎల్ఎలు పాల్గొన్నారని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్