గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొలంలో నీటిని బయటకు పంపండి

1 గంట క్రితం

VC_Cham.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 08:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి సత్యనారాయణ

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : అర్నాబ్ తుపాను ప్రభావిత జిల్లాలలో దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య ఎన్‌‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా పివి సత్యరాయణ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించేందుకు 152 మంది శాస్త్రవేత్తలతో 46 బృందాలు, వివిధ వ్యవసాయ కళాశాలకు చెందిన 300 మంది విద్యార్థులతో బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి పంటలలో తుపాను వల్ల జరిగిన పంటల నష్టాన్ని తగ్గించే దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందాలు క్షేత్రస్థాయిలో గురువారం పర్యటిం‌చాయి. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన ఎంటియు 1318 వరి రకము ప్రతికూల తుపాను పరిస్థితులలోనూ తట్టుకొని నిలదొక్కుకున్నాయని ఆయన తెలిపారు. అత్యధిక తుపాను ప్రభావం ఉన్న కాకినాడ, డాక్టర్‌ బిఆర్ అంబేద్కర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో విస్తృతంగా పర్యటించి పంటల పరిశీలించారు. పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి బయటకు పంపాలని సూచించారు.

మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మిల్లీలీటర్లు ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలన్నారు. కోత దశలో నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే, నీరు బయటకు తీసివేసిన తర్వాత, ఐదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు కళ్లు ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చెయ్యడం వల్ల గింజ మొలకెత్తడం, రంగు మరే అవకాశం తగ్గుతుందన్నారు. నీరు తగ్గిన తరువాత ఎకరాకు హెక్సాకోనాజోల్ 400 మిల్లీ లీటర్లు లేదా ప్రోపికోనాజోల్ 200 మిల్లీలీటర్లు పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతుందన్నారు. నీటి ముంపునకు గురైన పత్తి పొలాల నుండి అదనపు నీటిని తీసివేయాలని సూచించారు. శాఖీయ దశ, పూత దశ, కాయలు ఏర్పడే దశలో ఉన్న పంటకు ఎకరానికి 25-30 కిలోల యూరియాతో పాటు పది కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున పైపాటుగా వేయాలన్నారు. ఆకులు ఎర్రబడటం గమనిస్తే మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాములు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే బాగా ఆరిన పొడి పత్తిని మాత్రమే తీయాలనీ తడి పత్తిని మాత్రం తీయరాదన్నారు. తీసిన పొడి పత్తిని తడి నేలకు తాకకుండా గాలి బాగా ప్రసరించే కప్పు ఉన్న ప్రదేశంలో ఆరబెట్టాలని సూచించారు. మరకలు పడిన, బూజు పట్టిన, మొలకలు వచ్చిన పత్తిని మంచి నాణ్యమైన పత్తి నుండి వేరు చేయాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్