సార్‌బ్రూకెన్(జర్మనీ): హైలో ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి కిరణ్ జార్జి, మహిళల సింగిల్స్‌లో పివి సింధు ప్రవేశించగా.. హెచ్‌ఎస్ ప్రణయ్ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో ప్రణయ్ వరుససెట్లలో తనకంటే మెరుగైన ర్యాంక్ ఆటగాడు, ఫ్రాన్స్‌కు చెందిన టోమా పొపోవ్ చేతిలో 21-23, 16-21తో 3వ ర్యాంకర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక కిరణ్ జార్జి 21-18, 21-17తో కేవలం 35 నిమిషాల్లో మలేషియాకు చెందిన జూనే వుయ్‌ను చిత్తుచేశాడు. ఇక తరుణ్ మన్నేపల్లి 15-21, 19-21తో చెన్-యు-జెన్(చైనీస్ తైపీ) చేతిలో, శంకర్ ముత్తుసామి 11-21, 16-21తో ఫిన్లాండ్‌కు చెందిన కొల్జెనన్ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు.
ఇక మహిళల సింగిల్స్‌లఓ పివి సింధు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. అస్మిత అనూహ్యంగా తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. తొలిరౌండ్‌లో 2వ సీడ్ సింధు 21-10, 21-10తో కేవలం 28 నిమిషల్లోనే ఫ్రాన్స్‌కు చెందిన రోసే ఒక్టావియాను చిత్తుచేయగా.. అస్మిత 21-18తో తొలి గేమ్ నెగ్గినా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 12-21, 8-21తో బల్గేరియాకు చెందిన కొలొయానా చేతిలో ఓడి టోర్నీనుంచి నిష్ర్కమించింది.








కామెంట్‌లు (0)