- విజయవాడలో పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి - ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి : సాంస్కృతిక రంగంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని దసరా సాంస్కృతికోత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ పి.విజయ తెలిపారు. దీనిలో భాగంగా విజయవాడలో ‘4వ దసరా సాంస్కృతికోత్సవాలు’ నిర్వహించనున్నట్లు చెప్పారు. పది ప్రముఖ మహిళా సంఘాల ఆధ్వర్యాన అక్టోబర్ 7, 8 తేదీల్లో ‘యువత మేలుకుంటే సమాజంలో మార్పు తథ్యం’ థీమ్తో దసరా సాంస్కృతిక ఉత్సవాల పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఈ ఉత్సవాల పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో పి.విజయ మాట్లాడుతూ మూడేళ్లుగా మహిళా సంస్థలు, వేదికలు, ఎంబివికె, సేఫ్, తరుణీతరంగాలు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సన్ షైన్, రోటరీ మిడ్ టౌన్, వన్ ఎర్త్ వన్ లైఫ్, నిర్భయకాంతి మహిళా మండలి సంయుక్తంగా సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె ప్రతినిధులు సత్యవతి, కె.గీత, గాయత్రి, వన్ ఎర్త్ వన్ లైఫ్ ప్రతినిధి లీలాకుమారి, సేఫ్ ప్రతినిధి శేషారత్నం, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సన్ షైన్ ప్రతినిధులు బజితాజైన్, ధాత్రి పాల్గొన్నారు.









కామెంట్లు (0)