శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలి

10 సెప్టెంబర్, 2026

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి రైతు సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాలను తక్షణమే కరువు జిల్లాలుగా ప్రకటించాలని, నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్‌డిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట గురువారం ఆందోళనలు చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

కడప ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఎపి రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తగినంత వర్ష పాతం నమోదుకాకపోవడంతో కరువు ఛాయలు అలుముకున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కరువు బృందాలను రంగంలోకి దించి, క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని, కరువు తీవ్రతను అంచనా వేయాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని కోరారు. అనంతరం ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బెండి గ్రామ సచివాలయం వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 27 మండలాల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరువు జిల్లాగా ప్రకటించాలని, సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్