శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్నారులపై అత్యాచారం కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు

3 గంటల క్రితం

jail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- బాధితులకు రూ.మూడు లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం

- గుంటూరు పోక్సో కోర్టు తీర్పు

గుంటూరు :‌ ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శిరిపురం తండా ఉదయనగర్‌ ‌కాలనీకి చెందిన ‌వృద్ధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమాన విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి షమ్మి ప్రవీణ్‌ ‌సుల్తానా బేగం శుక్రవారం తీర్పునిచ్చారు. స్పెషల్‌ ‌పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌తీగల దుర్గాప్రసాద్‌ ‌కథనం ప్రకారం.. ఉదయ్‌ ‌నగర్‌ ‌కాలనీకి చెందిన బొజ్జా నాగమల్లేశ్వరరావు తన ఇంట్లోనే దుకాణం నిర్వహిస్తూ ఉండేవారు. 2024 జూన్‌ 16‌న స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బాలికలకు బిస్కెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి వారిపై లైంగికదాడికి పాల్పడ్డారు. వారు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో నకరికల్లు పోలీసు స్టేషన్‌‌లో వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డిఎస్‌‌పి గురునాధబాబు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు రుజువు కావడంతో న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. కేసు నమోదైనప్పుడు నాగమల్లేశ్వరరావు వయస్సు 68 ఏళ్లు కాగా ప్రస్తుతం 71 ఏళ్లు. తనకు పక్షవాతం ఉన్నందున శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. అయితే అందుకు సంబంధించి వైద్య చికిత్స రికార్డులేవని, పైగా బాలికలపై లైంగికదాడికి పాల్పడినప్పుడు అనారోగ్యం లేదని, ఈ కారణంతో శిక్ష తగ్గించడానికి వీలు లేదని, అంతేకాక ఇలాంటి సంఘటనలు సామాజిక నేరమని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులకు ప్రభుత్వం రూ.మూడు లక్షల చొప్పున రాష్ర్ట ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని తీర్పులో న్యాయమూర్తి ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్