మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల హామీలు మరిచి...ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

2 రోజుల క్రితం

jac
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 12:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి - కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మరిచి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఎపి ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటరామిరెడ్డి విమర్శించారు. కడప ప్రెస్ క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐదు డిఎలు, సరెండర్ లీవులు సహా ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా కొత్త పిఆర్‌‌సి కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం భేటీ తర్వాత అరకొర ప్రకటనలతో ఉద్యోగులను మోసం చేశారని పేర్కొన్నారు. కేవలం రెండు డిఎలు ప్రకటించడం ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.30 వేల కోట్ల ఉద్యోగుల బకాయిలు చెల్లించామన్న ప్రభుత్వ ప్రకటనపై వివరాలు వెల్లడించాలని కోరారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులపై అధిక పనిభారం, మానసిక ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్‌‌సిని ఎన్నికల రాజకీయాల కోసం ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్